Tuneega Tuneega Video Song | Manasantha Nuvve Movie Full Video Songs | Uday Kiran || YOYO Music – USHA Lyrics
Singer | USHA |
Music | R.P PATNAYAK |
THUNEEGA THUNEEGA SONG IN TELUGU LYRICS IN TELUGU
తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంక
దూరంగా పోనీక ఉంటాలే నీ వెనకాలే రానీ సాయంగా
ఆ వంక ఈ వంక తిరిగావే ఎంచక్కా
ఇంకానా చాలింక ఇంతేగా నీ రెక్క
ఎగిరేనా ఎప్పటికైనా ఆకాశం దాకా
తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంక
దొసిట్లో ఒక్కో చుక్క పోగేసి ఇస్తున్నాగా
వదిలెయ్యకు సీతాకోక చిలకలుగా
వామ్మో బాగుందే చిట్కా నాకూ నేర్పిస్తే చక్క
సూర్యున్నే కరిగిస్తాగా చినుకులుగా
సూర్యుడు ఏడి నీతో ఆడి చందమామ అయిపోయాడుగా
ఓ..ఓ..ఓ..ఓ…
తూనీగా తూనీగా ఎందాకా పరిగెడతావే రావే నా వంక
ఆ కొంగలు ఎగిరి ఎగిరి సాయంత్రం గూటికి మళ్ళీ
తిరిగొచ్చే దారిని ఎపుడూ మరిచిపోవెలా
ఓసారటు వైపెలుతుంది మళ్ళీ ఇటువైపొస్తుంది
ఈ రైలుకు సొంతూరేదో గురుతు రాదెలా
కూ కూ బండి మా ఊరుంది ఉండిపోవే మాతో పాటుగా