Nuvvu Naaku Nachav Telugu Movie Songs | Okkasari Cheppaleva Video Song | Venkatesh | VEGA Music – k.s.chithra kumarsanu Lyrics

Singer | k.s.chithra kumarsanu |
Music | koti |
okkasari cheppaleva song lyrics in telugu
ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ..
చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని
మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత
ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ
వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి ఓ..
నిదుర పొయే మదిని గిల్లి ఎందుకా అల్లరి
చరణం : 1
చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని
చేయి చాచి పిలవద్దు అని చంటిపాపలకి చె బుతామా
లేని పోని కలలెందుకని మేలుకుంటే అవి రావు అని
జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకి చె బుతామా
కలలన్నవి కలలని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని
మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా
॥ఒక్కసారి॥
చరణం : 2
అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరిజల్లులతో
చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా
అంతులేని తన అల్లరితో అలుపు లేని తన అలజడితో
కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా
మనసుంటే మార్గం ఉంది కదా అనుకుంటే అందనిదుంటుందా
అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా
॥ఒక్కసారి॥
MOVIE NAME; NUVVU NAKU NACHAVU
SONG; OKKASARI CHEPPALEVA