Advertisement
Mutyala Muggu – Gogulu Pooche Govulu Kache – RAMAKRISHNA SUSHEELAMMA Lyrics
Advertisement
Singer | RAMAKRISHNA SUSHEELAMMA |
Singer | BALA MURALIKRISHNA |
Music | K.V MAHADEVAN |
GOGULU POOCHE SONG LYRICS IN TELUGU
గోగులు పూచే గోగులు కాచే
ఓ లచ్చ గుమ్మడి
గోగులు పూచే గోగులు కాచే
ఓ లచ్చ గుమ్మడి
గోగులు దులిపే వారెవరమ్మ ఓ లచ్చ గుమ్మడి
పొద్దు పొడిచే పొద్దు పొడిచే ఓ లచ్చ గుమ్మడి
పుత్తడి వెలుగులు కొత్తగ మెరిసే ఓ లచ్చ గుమ్మడి
పొద్దు కాదది నీ ముద్దు మోమున
దిద్దిన తిలకమే సుమా(2)
వెలుగులు కావవి నీ పాదాలకు
అలదిన పారాణి జిలుగులే సుమా
ముంగిట వేసిన ముగ్గులు చూడు
ఓ లచ్చ గుమ్మడి
ముత్యాల ముగ్గులు చూడు
ఓ లచ్చ గుమ్మడి
ముంగిలి కాదది నీ అడుగులలో
పొంగిన పాల కడలియే సుమా
ముగ్గులు కావవి నా అంతరంగాన
పూచిన రంగవల్లులే సుమా
మల్లెలు పూచే మల్లెలు పూచే
ఓ లచ్చ గుమ్మడి
వెన్నెల కాచే వెన్నెల కాచే
ఓ లచ్చ గుమ్మడి
మల్లెలు కావవి మా మహాలక్ష్మి
విరజల్లిన సిరినవ్వులే సుమా
MOVIE NAME; MUTYALAMUGGU
SONG; GOGULA POOCHE
Advertisement