Emjarugutondi Emjarugutondi Video Song – Mahatma Movie || Srikanth, Bhavana – KARTHIK SANGEETHA Lyrics

Singer | KARTHIK SANGEETHA |
Music | VIJAYANTONY |
Song Writer | Sirivennela seetharama sastry |
EMJARUGUTONDI SONG LYRICS IN TELUGU
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా !
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !!
హే నీ ఎదట నిలిచే వరకూ .. ఆపదట తరిమే పరుగూ
ఏ పనట తమతో తనకూ .. తెలుసా హో!
నీ వెనక తిరిగే కనులూ .. చూడవట వేరే కలలూ
ఏ మాయ చేసావసలూ .. సొగసా !!
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా !
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !!
పరాకులో పడిపోతుంటే .. కన్నె వయసు కంగారూ
అరే అరే అంటూ వచ్చీ తోడు నిలబడూ
పొత్తిళ్ళల్లో పసిపాపల్లే .. పాతికేళ్ళ మగ ఈడూ
ఎక్కెకెక్కి ఏం కావాలందో అడుగు అమ్మడూ
ఆకాసమే ఆపలేనీ చినుకు మాదిరీ .. నీకోసమే దూకుతోందీ చిలిపి లాహిరీ
ఆవేశమే ఓపలేని వేడీ ఊపిరీ .. నీతో సావసమే కోరుతోంది ఆదుకోమరీ
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా !
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !!
ఉండుండిలా ఉబికొస్తుందేం కమ్మనైన కన్నీరు
తీయనైన గుబులిది అంటే నమ్మేదెవ్వరూ
మధురమైన కబురందిందే కలత పడకు బంగారూ
పెదివితోటి చెక్కిలి నిమిరే చెలిమి హాజరూ
గంగలాగ పొంగి రానా ప్రేమ సంద్రమా
నీలో కరిగి అంతమవనా ప్రాణ బంధమా
అంతులేని దాహమవనా ప్రియ ప్రవాహమా
నీతో కలిసి పూర్తి అవనా మొదటి స్నేహమా
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా !
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోంది నా వయసు ఇవేళా !!
హే నీ ఎదట నిలిచే వరకూ .. ఆపదట తరిమే పరుగూ
ఏ మాయ చేసావసలూ .. సొగసా
ఏం జరుగుతోంది ఏం జరుగుతోంది నా మనసుకివాళా !
ఏం వెతుకుతోంది ఏం వెతుకుతోందినా వయసు ఇవేళా !!
MOVIENAME ; MAHATHMA
SONG; EMJARUGUTONDI