Gabbar Singh Songs | Akasam Ammayaithe Full Video Song | Latest Telugu Superhits @SriBalajiMovies – HARISH SHANKAR Lyrics

Singer | HARISH SHANKAR |
Music | devi sriprasad |
AAKASAM AMMAYI AYITHE LYRICS IN TELUGU
ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సిందూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం
ఓ ఆకాశం అమ్మాయైతే నీలా ఉంటుందే నీలా ఉంటుందే
ఓ ఆనందం అల్లరి చేస్తే నాలా ఉంటుందే
నాలా ఉంటుందే నాలా ఉంటుందే
వానల్లే నువ్వు జారగా నేలల్లె నేను మారగా
వాగల్లె నువ్వు నేను చేరగా
మది వరదై పొంగి సాగరమవుతుందే
హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల
ఏం చక్కని మందారం ఇది ఎనిమిది దిక్కుల సిందూరం
ఏం మెత్తని బంగారం ఇది మనసున రేపెను కంగారం
ఏం కమ్మని కర్పూరం ఇది కన్నెగ మారిన కాశ్మీరం
ఏం వన్నెల వయ్యారం ఇక తియ్యని ప్రేమకి తయ్యారం
అల్లేసి నను గిల్లేసి తెగ నవ్వినావే
సుగుణాల రాక్షసీ శత్రువంటి ప్రేయసి
పట్టేసి, కనిపెట్టేసి దడ పెంచినావే
దయలేని ఊర్వశి దేవతంటి రూపసి
గాలుల్లో రాగాలన్నీ నీలో పలికేనే నిద్దుర పుచ్చేనే
ఓ లోకంలో అందాలన్నీ నీలో చేరెనే నిద్దుర లేపెనే
హోలా హోలాహ హోలా హోలాహ నీ కళ్ళల్లోనే చిక్కానే పిల్ల
హోలా హోలాహ హోలా హోలాహ ఇక చాలా చాలా జరిగే నీ వల్ల
ఆనందం ఆనందం ఆనందం అంటే అర్థం
ఈనాడే తెలిసింది కొత్త పదం
ఆనందం ఆనందం నీవల్లే ఇంతానందం
గుండెల్లో కదిలింది పూల రథం
వచ్చేసి బతుకిచ్చేసి మసి చేసినావే
రుషి లాంటి నా రుచి మార్చినావే అభిరుచి
సిగ్గేసి చలిమొగ్గేసి ఉసి గొలిపినావే
సరిగమగా పదనిసి చేర్చినావే రోదసి
స్వర్గంలో సౌఖ్యాలన్నీ నీలో పొంగెనే ప్రాణం పోసేనే
ఓ నరకంలో నానా హింసలు నీలో సొగసేనే ప్రాణం పోసెనే