Anand Telugu Movie Songs – Nuvena Na Nuvena – Shreya Ghoshal. k.m radhakrishnan Lyrics
Singer | Shreya Ghoshal. k.m radhakrishnan |
Music | K M Radha Krishnan. |
NUVVENA NAA NUVVENA SONG LYRICS IN TELUGU
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
సూర్యుడల్లే సూది గుచ్చీ సుప్రభాతమేనా
మాటలాడే చూపులన్నీ మౌన రాగమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా.. ఆ
ఆనందమేనా.. ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
మేఘమల్లే సాగి వచ్చీ
దాహమేదో పెంచుతావు
నీరు గుండెలోన దాచీ
మెరిసి మాయమౌతావు
కలలేనా కన్నీరేనా
తేనెటీగ లాగ కుట్టీ
తీపి మంట రేపుతావు
పువ్వు లాంటి గుండెలోనా
దారమల్లె దాగుతావు
నేనేనా నీ రూపేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా.. ఆ
ఆనందమేనా.. ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
నువ్వేనా నాకు నువ్వేనా
కోయిలల్లే వచ్చి ఏదో కొత్త పాట నేర్పుతావు
కొమ్మ గొంతులోన గుండే కొట్టు కుంటే నవ్వుతావు
ఏ రాగం ఇది ఏ తాళం
మసక యెన్నెలల్లే నీవూ
ఇసుక తెన్నె చేరుతావూ
గసగసాల కౌగిలింతా
గుసగుసల్లే మారుతావు
ప్రేమంటే నీ ప్రేమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా
చేరువైనా దూరమైనా ఆనందమేనా.. ఆ
ఆనందమేనా.. ఆనందమేనా
నువ్వేనా నా నువ్వేనా
MOVIE NAME; ANAND
SONG; NUVVENA