MANASU MAREE VINTHAGA SONG LYRICS IN TELUGU |NANI |ADITHI ROY |

Advertisement

Manasu Maree Full video Song | V Songs | Nani, Aditi Rao Hydari | Amit Trivedi – Amit Trivedi, Shashaa Tirupati & Yazin Nizar Lyrics

Advertisement
Singer Amit Trivedi, Shashaa Tirupati & Yazin Nizar
Music Amit Trivedi
Song Writer Sirivennela seetharama sastry

MANASU MAREE MATTUGA LYRICS IN TELUGU

మనసు మరీ మత్తుగా
తూగి పోతున్నదే… ఏమో ఈ వేళ.
వయసు మరీ వింతగా
విస్తుబోతున్నదే… నీదే ఈ లీల

అంతగా కవ్విస్తావేం గిల్లి,
అందుకే బంధించెయ్ నన్నల్లీ.

ఖిలాడీ కోమలీ.. గుళేబకావలి
సుఖాల జావలి.. వినాలి కౌగిలీ

మనసు మరీ మత్తుగా
తూగి పోతున్నదే ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా
విస్తుబోతున్నదే నీదే ఈ లీల

ఓ.. అడుగులో అడుగువై..
ఇలా రా నాతో నిత్యం వరాననా
బతుకులో బతుకునైనివేదిస్తా, నాసర్వం జహాపనా

పూల నావ.. గాలి తోవ
హైలో.. హైలెస్సో.. ఓ ఓ
చేరనీవా చేయనీవా.. సేవలేవేవో

మనసు మరీ మత్తుగా..
తూగి పోతున్నదే ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా..
విస్తుబోతున్నదే నీదే ఈ లీల.

మనసులో అలలయే రహస్యాలేవో
చెప్పే క్షణం ఇది…
మనువుతో మొదలయే
మరో జన్మాన్నై పుట్టే వరమిది…

నీలో ఉంచా.. నా ప్రాణాన్ని
చూసి పోల్చుకో..ఓ ఓ
నాలో పెంచా నీ కలలన్నీ
ఊగనీ ఉయ్యాల్లోమనసు మరీ మత్తుగా..
తూగి పోతున్నదే ఏమో ఈ వేళ
వయసు మరీ వింతగా
విస్తుబోతున్నదే నీదే ఈ లీల

అంతగా కవ్విస్తావేం గిల్లి,
అందుకే బంధించెయ్ నన్నల్లీ..
ఖిలాడీ కోమలీ.. గుళేబకావలి,
సుఖాల జావలి.. వినాలి కౌగిలీ

SONG; MANASU MAREE
MOVIE NAME; V



Advertisement

Leave a Reply