KANNULLONI ROOPAME SONG – HARIHARAN K.S.CHITHRA Lyrics

Singer | HARIHARAN K.S.CHITHRA |
Music | SANDEEP CHOWTHA |
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనమే
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపునాపేదెలా
నీ నీలికన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా
గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
అదిరేటి పెదవుల్ని బతిమాలుతున్నాను మదిలోని మాటేదనీ
తలవంచుకుని నేను తెగ ఎదురు చూశాను నీ తెగువ చూడాలనీ
చూస్తూనే వేళంత తెలవారిపోతుందో ఏమో ఎలా ఆపటం
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
ఆ ఊసుని తెలిపేందుకు నా భాష ఈ మౌనం
కన్నుల్లో నీ రూపమే గుండెల్లో నీ ధ్యానమే
నా ఆశ నీ స్నేహమే నా శ్వాస నీ కోసమే
MOVIE NAME; NINNEPELLADATHA
SONG; KANNULLONI RUPAME