CHINUKU THADIKI SONG LYRICS IN TELUGU  |  NEE SNEHAM MOVIE  |  UDAYKIRAN  |  USHA  | AARTHIAGARWAL  | 

Advertisement

Chinuku Thadiki Video Song – Nee Sneham Movie – USHA Lyrics

Advertisement
Singer USHA
Music R.P PATNAYAK
Song Writer Sirivennela seetharama sastry

CHINUKU THADIKI SONG LYRICS IN ELUGU

ఆ… ఆ… ఆ…

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా

ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

మువ్వలే మనసు పడు పాదమా

ఊహలే ఉలికి పడు ప్రాయమా

హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా

ఆమని మధువనమా

ఆ… ఆమని మధువనమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా

ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా…సరిగసా సరిగసా రిగమదని

సరిగసా సరిగసా నిదమ దని

సాసా నిని దాద మామ గమదనిరిస గా

నినిదగ నినిదగ నినిదగ నినిదగ

సగమగ సనిదని మద నిస నిస గసగాపసిడి వేకువలు పండు వెన్నెలలు

పసితనాలు పరువాల వెల్లువలు

కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ

పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు

కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా

పాల కడలి కెరటాల వంటి

నీ లేత అడుగు తన ఎదను మీటి

నేలమ్మ పొంగెనమ్మా

ఆ… ఆగని సంబరమా ఆ….. ఆగని సంబరమాసగమగా రిస సనిదమగ సగ సగమగా

రిస సనిదమగ సగ

సగస మగస గమద నిదమ గమదనిసా

సనిస సనిస నిస నిస నిస గమ రిస

సనిస సనిస నిస నిస నిస గమ రిస

గాగ నీని గగ నీని దగ నిగ సపావరములన్నీ నిను వెంట బెట్టుకొని

ఎవరి ఇంట దీపాలు పెట్టమని

అడుగుతున్నవే కుందనాల బొమ్మ

సిరుల రాణి నీ చేయి పట్టి

శ్రీహరిగా మారునని రాసిపెట్టి

ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా

అన్నమయ్య శృంగార కీర్తనల

వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా

ఆ…రాముని సుమ శరమా

ఆ…రాముని సుమ శరమాచినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా

ఎవరి కనుల చిలిపి కలవు నువ్వమ్మా

మువ్వలే మనసు పడు పాదమా

ఊహలే ఉలికి పడు ప్రాయమా

హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా

ఆమని మధువనమా

ఆ…ఆమని మధువనమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా

ఎవరి కనుల చిలిపి కలవమ్మా

MOVIENAME; NEE SNEHAM
SONG ; CHINUKU TADIKIAdvertisement

Leave a Reply