ITHAM | Sharwanand, Ritu Varma | Jakes Bejoy | Sid Sriram – sidsriram Lyrics

Singer | sidsriram |
Music | Jakes Bejoy |
అమ్మా వినమ్మా
నేనానాటి నీ లాలి పదాన్నే
ఓ అవునమ్మా… నేనమ్మా
నువ్వు ఏనాడో కానీ పెంచిన స్వరాన్నే
మౌనమై ఇన్నాళ్లు
నిదురలోనే ఉన్నా
గానమై ఈనాడే మెలుకున్నా
నీ పాదాలకు మువ్వల్లా
నా అడుగులు సాగాలమ్మ
నీ పెదవుల చిరు నవ్వుల్లా
నా ఊపిరి వెలగాలమ్మ
నిరంతరం నీ చంటి పాపల్లె
ఉండాలి నే ఎన్నాళ్ళికి
నిన్నొదిలెంతగా ఎదగాలనుకొనే
అమ్మా…
ఆణువణువనువు నీకు నీవే
అమ్మా…
ఎదసడిలో శృతిలయలు నువ్వే
అమ్మా… నే కొలిచే శారదవే
నన్ను నిత్యం నడిపే సారథివే
బెదురూ పోవాలంటే
నువ్వు కనిపించాలి
నిదర రావాలంటే
కథలు వినిపించాలి
ఆకలయ్యిందంటే నువ్వే తినిపించాలి
ప్రతి మెతుకు నా బతుకనిపించేలా
నువ్వుంటేనే నేను
నువ్వంటే నేను
అనుకోలేకపోతే ఏమైపోతానో
నీ కడచూపే నన్ను కాస్తూ ఉండక
తడబడి పడిపోనా చెప్పమ్మా
మరి మరి నను నువ్వు మురిపంగా
చూస్తూ ఉంటె చాలమ్మ
పరిపరి విధముల గెలుపులుగా
పైకి ఎదుగుతూ ఉంటానమ్మా
అయినా సరే ఏనాటికి
ఉంటాను నీ పాపాయినై
నిన్నొదిలెంతగా ఎదగాలనుకొనే
నిరంతరం నీ చంటి పాపల్లె
ఉండాలి నే ఎన్నాళ్ళికి
నిరంతరం నీ చంటి పాపల్లె
ఉండాలి నే ఎన్నాళ్ళికి
నిరంతరం నీ చంటి పాపల్లె
ఉండాలి నే ఎన్నాళ్ళికి
నిన్నొదిలెంతగా ఎదగాలనుకొనే
అమ్మా…
ఆణువణువనువు నీకు నీవే
అమ్మా…
ఎదసడిలో శృతిలయలు నువ్వే
అమ్మా… నే కొలిచే శారదవే
నన్ను నిత్యం నడిపే సారథివే
అమ్మా…
MOVIE NAME; OKEOKA JEEVITHAM
SONG; AMMAVINAMMA